Saturday, November 16, 2024

అమెరికాలో వచ్చేనెల నుంచి బూస్టర్ డోసులు ప్రారంభం : బైడెన్

- Advertisement -
- Advertisement -

Covid Booster dose start in America next month: Joe Biden

వాషింగ్టన్ : అమెరికాలో వ్యాక్సినేషన్ భారీగా చేపట్టినప్పటికీ గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 20 నుంచి బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభమౌతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు. ఎవరైతే రెండో డోసు తీసుకుని ఎనిమిది నెలలయిందో వారికి ఉచితంగా డోసులు అందజేయనున్నట్టు చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాలు టీకా మొదటి డోసు కోసం నిరీక్షిస్తుండగా అమెరికన్లు అదనంగా డోసుల నుంచి రక్షణ పొందుతున్నారన్న విమర్శను బైడెన్ పట్టించుకోలేదు. ఇతర దేశాలు మొదటి టీకా పొందేవరకు అమెరికా మూడో డోసు తీసుకోరాదని ప్రపంచ నేతలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని బైడెన్ పేర్కొన్నారు. అమెరికా ప్రజల భద్రతను చూడడంతోపాటు ప్రపంచ దేశాలకు కూడా ఇదే సమయంలో సహాయం చేస్తామని బైడెన్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News