Friday, November 22, 2024

ఊహించిన స్థాయి లోనే బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్లు : ఇన్సాకాగ్

- Advertisement -
- Advertisement -

COVID-19 breakthrough infections in India

న్యూఢిల్లీ : కరోనా నుంచి రక్షణ కోసం రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కొందరికి కరోనా సోకుతోంది. దీన్నే బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్లుగా పేర్కొంటారు. ఈ విధంగా దేశంలో బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్లు బారిన పడిన వారి సంఖ్య ఊహించని స్థాయి లోనే ఉందని కరోనా జన్యుక్రమాన్ని గుర్తిస్తున్న ప్రభుత్వ సంస్థల కన్సార్టియం … ఇన్సాకాగ్ తెలియచేసింది. ఇప్పటివరకు ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారి సంఖ ఇతర ప్రామాణికాలను పరిగణన లోకి తీసుకుని ఈ విషయం గుర్తించినట్టు ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ జనాభాలో వ్యాక్సినేషన్ పూర్తయిన వారి సంఖ్య, కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి టీకాల సమర్థతను తగ్గించ గలిగే డెల్టా వేరియంట్ ప్రభావం వంటివి విశ్లేషించినప్పుడు దేశంలో వ్యాక్సినేషన్ బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు ఊహించిన స్థాయి లోనే ఉన్నాయి.

అయితే ప్రస్తుత వ్యాక్సిన్లు తీవ్రమైన అనారోగ్యం నుంచి తప్పించడమే కాకుండా ప్రజారోగ్య వ్యవస్థకు కీలకమైనవిగా ఉంటున్నాయని ఇన్సాకాగ్ పేర్కొంది. అధిక తీవ్రత కలిగిన డెల్టా ఉపరకాలు డెల్టా ప్లస్‌కు చెందిన ఎవై .1, ఎవై .12 వరకు కలిగిన రకాలు విశ్లేషించినట్టు ఇన్సాకాగ్ వెల్లడించింది. మొత్తం 856 శాంపిళ్లను విశ్లేషించింది. ఎ.12 రకం ప్రస్తుతం దేశంలో ఎక్కడా కనిపించలేదని వివరించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చెందాల్సిన రీతిలో కొత్త వేరియంట్ కానీ పరిశోధించ దగ్గ వేరియంట్ ఏదీ లేదని ఇన్సాకాగ్ అభిప్రాయ పడింది. డెల్టా వేరియంట్ మాదిరి గానే డెల్టా ఉపరకాల్లోనూ బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు అదే స్థాయిలో ఉంటాయని తెలియచేసింది. అయితే ఇలాంటి బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడిన వారిలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తిన దాఖలాలు లేవని ఇప్పటికే అనేక అధ్యయనాలు తేల్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News