మూడు రోజులు దేశమంతా లాక్‌డౌన్ విధింపు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ఆరు నెలల తరువాత కొత్తగా కరోనా కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఏడుగురికి కరోనా సోకింది. మొట్టమొదటి కేసు బయటపడగానే ప్రధాని జెసిండా ఆర్డెర్నా కఠిన ఆంక్షలతో లాక్‌డౌన్ విధించారు. దేశం మొత్తం మీద కనీసం మూడు రోజులైనా లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. ఆక్లాండ్, కోరమండల్ వంటి నగరాల్లో వారం వరకు కొనసాగవచ్చు. కేసులు మరిన్ని పెరగవచ్చని ప్రభుత్వం అంచనా వేసిందని, ఎవరైతే కరోనా బాధితులో వారు చర్చి, పాఠశాల, కేసినో, ఆస్పత్రుల్లో గడిపారని, ఆర్డెర్నా బుధవారం వెల్లడించారు. సూపర్ మార్కెట్లు, గ్యాస్ స్టేషన్లు, ఫార్మసీలలో ఉన్నప్పుడు తప్పనిసరిగా జనం మాస్కులు ధరించాలని ఆమె నిబంధనలు సూచించారు. ఇప్పుడు వ్యాపిస్తున్నది డెల్టా వేరియంట్ అని జీనోమ్ పరీక్ష ద్వారా నిర్ధారణ అయిందని, ఆస్ట్రేలియానుంచి ఇది వ్యాపిస్తున్నట్టు తేలిందని చెప్పారు. స్యూజిలాండ్ సరిహద్దులు దాటి ఎలా ఈ వైరస్ వ్యాపించిందో పరిశీలిస్తున్నారు.