- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో కరోనా కేసులు భారీగా పెరిగి 200 మార్క్ దాటింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 219 కేసులు నమోదు అయ్యాయి. 76 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1259 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 164 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్టా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
- Advertisement -