Friday, November 22, 2024

నో వర్రీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మన భారత్‌లో ఇప్పటికే ప్రజల కు కరోనా ‘సామూహిక రోగనిరోధకత’ (హెర్డ్ ఇమ్యూనిటీ) వచ్చేసిందని సెం టర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బ యోలజీ (సిసిఎంబి) డైరెక్టర్ విన య్ కె నందికూరి తెలిపారు. ప్ర స్తుతం చైనాలో బీఎఫ్ 7 వేరియంట్‌కు ఉన్న తీవ్రత భారత్‌లో ఉండకపోవచ్చునని పేర్కొన్నారు. అలాగే డెల్టా వేరియంట్ అంత ప్ర మాదకరం కా దని స్పష్టం చే శారు. ప్రజలు మాత్రం కొవిడ్ వ్యాప్తి అరికట్టేందుకు జా గ్రత్తలు తీసుకోవాల్సిందేనని వినయ్ నందికూరి సూ చించారు. కొత్తగా వ చ్చే అన్ని వేరియంట్లకు రోగనిరోధకతను తప్పించుకునే గుణం ఉండొచ్చని హెచ్చరించారు. టీకా తీసుకున్నా.. గతంలో ఇతర వేరియం ట్ల బారిన పడినవారికి కూడా మళ్లీ కరోనా సోకే ముప్పు లేకపోలేదని పే ర్కొన్నారు. మనం ఇప్పటికే అతిపెద్ద డెల్టా వేవ్‌ను చూశామని, వ్యాక్సిన్లు తీసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత ఒమిక్రాన్ వచ్చిందని, దాంతో వెంటనే బూస్ట ర్ డోసులువేసుకున్నామని వివరించారు.

ఇలా ఏ రకంగా చూసినా మనం చైనా వారితో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నామని, అందుకే అక్కడి పరిస్థితులు ఇక్కడ తలెత్తకపోవచ్చని చెప్పారు. చైనా అనుసరించిన జీరో కొవిడ్ విధానమే ప్రస్తుతం అక్కడ వైరస్ విజృంభించడానికి కారణమని వినయ్ కె నందికూరి అభిప్రాయపడ్డారు. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగకపోవడం కూడా తీవ్రతను మరింత పెంచి ఉంటుందన్నారు. భారత్‌లో మాత్రం వృద్ధులకు సైతం బూస్టర్ డోసులు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. అయితే, భారత్‌లో మరో వేవ్ వస్తుందా..? లేదా..? అని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం తక్షణమే వేవ్ వస్తుందని చెప్పేంత ముప్పు మాత్రం కనిపించడం లేదని అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స, వ్యాక్సినేషన్ అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఏదైనా ఒక వ్యాధి జనాభాలోని ఒక పెద్ద భాగంలో వ్యాపిస్తే, మనుషుల సామూహిక రోగనిరోధక శక్తి పెరిగి ఆ వ్యాధిని తట్టుకోగలగడమే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. మనుషుల రోగ నిరోధక శక్తి ఆ వ్యాధి వ్యాపించకుండా అడ్డుకునేందుకు సాయం చేస్తుంది. అంటే, జనాభా ఆ వ్యాధితో పోరాడి పూర్తిగా కోలుకోగలుగుతుంది. వారు ఆ వ్యాధి నుంచి ‘ఇమ్యూన్’ అవుతారు. అంటే వారిలో రోగ నిరోధక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. వారిలో ఆ వైరస్‌ను తట్టుకోగలిగే ‘యాంటీ-బాడీస్’ తయారవుతాయి. క్రమంగా ప్రజలలో రోగ నిరోధక శక్తి పెరిగే కొద్దీ, వైరస్ వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతూ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News