Monday, December 23, 2024

బీజింగ్‌లో చనిపోయినవారిని పాతిపెట్టడానికి మనుషులు కరువు!

- Advertisement -
- Advertisement -

బీజింగ్/షాంఘై: చైనాలోని బీజింగ్ నగరంలో 2.20 కోట్ల మంది నివసిస్తున్నారు. ఆ నగరంలో ఇప్పుడు కొవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. స్మశాన వాటికలకు శనివారం విపరీతంగా ఫోన్‌కాల్స్ అందాయి. అంతిమ సంస్కారాలు చేయడానికి అక్కడ ఇప్పుడు మనుషుల కొరత ఏర్పడింది. చాలా మందికి కొత్త కరోనావైరస్ సోకింది.
చైనా జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలుపడం, ఒమిక్రాన్ స్ట్రెయిన్ బలహీనపడిందని ప్రకటించడం వంటివి వారం కిందటే జరిగాయి.

అంతం అనేది లేకుండా పరీక్షలు, లాక్‌డౌన్‌లు, ప్రయాణాలపై భారీ ఆంక్షలు వంటివి చైనాలో ప్రజలను ఆగ్రహానికి గురిచేశాయి. చివరికి చైనా అధ్యక్షుడు తన జీరో కొవిడ్ పాలసీని సడలించారు. ప్రజలు ఇప్పుడిప్పుడే పెద్ద సంఖ్యలో బయట తిరుగుతున్నారు. అయితే మళ్లీ చైనాలో ఫస్ట్ వేవ్ సంక్రమణలు మొదలయ్యాయి.

బీజింగ్‌లో పాలసీ మార్పు చేసిన డిసెంబర్ 7 నుంచి ఎంత మంది చనిపోయారన్న నివేదిక ఇంకా అందాల్సి ఉంది. సేవలందించే వారు కరువయ్యారు. చాలా మందికి వ్యాధి సంక్రమించి ఉంది. రెస్టారెంట్లు మొదలుకుని కొరియర్ సంస్థల్లో పనిచేసేవారందరికీ వ్యాధి సోకింది. అంతిమ సంస్కారాల సేవలందించేవారు కూడా ఇప్పుడు కరువయ్యారు.
“మా వద్ద ఇప్పుడు అతి తక్కువ కార్లు, వర్కర్లు ఉన్నారు”అని మియూన్ ఫ్యునరల్ హోమ్ స్టాఫర్ ఒకరు తెలిపారు. అయితే అంతిమ సంస్కారాలకు డిమాండ్ పెరిగిపోతోందన్నారు. కానీ చేసేవారే కరువయ్యారు. “మా వర్కర్లలో చాలా మందికి పాజిటివ్ వచ్చింది” అని కూడా అన్నారు.

“హ్యూరూ ఫ్యునరల్ హోమ్ వద్ద అయితే అంతిమ సంస్కారాలు చేయడానికి శవాలకు మూడు రోజులకు కూడా అవకాశం దక్కడంలేదు” అని ఓ స్టాఫర్ చెప్పారు. అక్కడ ఎంత రద్దీ ఉందంటే… శవాలు ఎవరి తాలూకివో వారే మోసుకెళ్లాల్సిన పరిస్థితి. చైనాలో ఆరోగ్య అధికారులు చివరిసారిగా డిసెంబర్ 3న కొవిడ్ మరణాల నివేదికను ఇచ్చారు. కొవిడ్ మరణాలు 5235 లెక్కను శనివారం నాటికి కూడా జాతీయ ఆరోగ్య కమిషన్ మార్చలేదు. ఒక లెక్కా పత్రంలేదు. చైనా వ్యాధి లక్షణాలున్న కేసుల వివరాలను బుధవారం నుంచి ఆపేసింది. పిసిఆర్ టెస్టింగ్ చేయడానికి వసతులు లేవని పేర్కొంది. ఇప్పుడు చైనాలో ఎంతమంది కొవిడ్ సోకిన వారున్నారన్నది ఇదమిద్దంగా తెలియడంలేదు. షాంఘైలో అనేక పాఠశాలలు ఆన్‌లైన్ ద్వారానే బోధనలు నిర్వహిస్తున్నాయి. చైనాలో రోజురోజుకు కొవిడ్ పరిస్థితి విషమంగా మారుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News