Wednesday, January 22, 2025

అభివృద్ధికి కరోనా అడ్డు కారాదు

- Advertisement -
- Advertisement -
Covid does not hinder development Says PM Modi
మహమ్మారిలోనూ గత ఏడాది అన్ని రంగాల్లో వృద్ధి సాధించాం
ఇది మరింత వేగవంతం కావాలి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో భారత్ తన అభివృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, కొవిడ్ మహమ్మారితో ఎదురయిన సవాళ్లు వృద్ధి ప్రక్రియకు అడ్డంకి కాకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశం కొవిడ్ మహమ్మారిని పూర్తి జాగ్రత్తలతో, నిఘాతో ఎదుర్కొంటుందని, అదే సమయాంలో దేశ ప్రయోజనాలను కూడా కాపాడుతుందని ఆయన అన్నారు. శనివారం పిఎం కిసాన్ పథకం కింద పదో విడత నిధులను విడుదల చేసిన కార్యక్రమంలో ప్రధాని కొవిడ్ మహమ్మారి ఓ వైపు కొనసాగుతున్నప్పటికీ 2021 సంవత్సరంలో దేశం ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం, స్టార్టప్, పర్యావరణం, మౌలిక సదుపాయాలు లాంటి రంగాల్లో సాధించిన విజయాలను గుర్తు చేశారు.‘ కొవిడ్19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశం సాగించిన బలమైన పోరాటానికి, అలాగే ఈ సంవత్సర కాలంలో చేపట్టిన సంస్కరణలకు గాను 2021 సంవత్సరం గుర్తిండిపోతుంది’ అని ప్రధాని అన్నారు. అంతేకాకుండా 145 కోట్లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్ డోసుల రికార్డును సాధించడాన్ని ఆయన ప్రశంసించారు.

గడచిన ఏడాది భారత్ వివిధ రంగాల్లో సంస్కరణలను వేగవంతం చేసిందని, ఆధునిక మౌలిక సదుపాయాలను సృష్టించిందని ప్రధాని అన్నారు. ‘ అభివృద్ధి వేగాన్ని మరింతగా పెంచాలి. కొవిడ్ మహమ్మారి సవాళ్లను విసురుతోంది. అయితే అభివృద్ధి ప్రక్రియను అడ్డుకోలేదు’ అని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతానికన్నా ఎక్కువగా వృద్ధి చెందుతోందని, పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, విదేశీ ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, జిఎస్‌టి వసూళ్లు సైతం పెరుగుతున్నాయని కొత్త ఏడాదిలో చేసిన తొలి ప్రసంగంలో ప్రధాని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఎగుమతులు400 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నాయని, ఎగుమతుల విషయంలో ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయ రంగంలో దేశం సరికొత్త నమూనాలను నెలకొల్పిందని కూడా ఆయన చెప్పారు. మహిళల వివాహ వయసును మగవారితో సమానంగా 18 ఏళ్లనుంచి 21 ఏళ్లకు పెంచే ప్రక్రియను చేపట్టినట్లు కూడా ప్రధాని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News