Sunday, December 22, 2024

కోవిడ్ కు వ్యాక్సీన్ అదనపు డోస్ అక్కర్లేదు

- Advertisement -
- Advertisement -

కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 ప్రబలుతూండటంతో ప్రజలలో మళ్లీ ఆందోళన మొదలైంది. దీనికోసం వ్యాక్సీన్ అదనపు డోస్ తీసుకోవాలనే ప్రచారం కూడా మొదలైంది. అయితే జేఎన్-1 వేరియంట్ కోసం అదనంగా వ్యాక్సీన్ డోస్ తీసుకోవలసిన అవసరం లేదని సార్స్ –కోవ్ 2 జినోమిక్స్ కన్సార్టియం చీఫ్ డాక్టర్ అరోరా స్పష్టం చేశారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో సోకిన కరోనా వేరియంట్ కూ, దీనికీ మధ్య పెద్ద తేడా లేదని చెప్పారు. ఇప్పటివరకూ తాము 400 కోవిడ్ వేరియంట్లను గుర్తించామని, ఇవి మార్పు చెందుతూనే ఉన్నాయని ఆయన తెలిపారు.

ఒమిక్రాన్ వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటివి వచ్చినా ఐదు రోజుల్లో కోలుకోవచ్చునని అరోరా తెలిపారు. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ కు సంబంధించిన 22 కేసులు వెలుగులోకి వచ్చినా, వీటిలో చాలా కేసులు ఆసుపత్రిలో చేరకుండానే నయమయ్యేవేనని చెప్పారు. అయితే పిల్లలు, 60 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తాజా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News