Friday, November 22, 2024

రాష్ట్రాలకు 15 శాతం కొవిడ్ ఎమర్జెన్సీ ప్యాకేజి నిధులు

- Advertisement -
- Advertisement -
Covid emergency response package
యుపికి ఎక్కువగా రూ. 281కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ : కొవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చుకునేందుకు వీలుగా కొవిడ్ 19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టిం ప్రిపేర్డ్‌నెస్ (ఇసిఆర్‌పి 2) ప్యాకేజి కింద 15 శాతం నిధులను రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది. శనివారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.1,827.8 కోట్లు విడుదల చేశారు. ఈ ప్యాకేజి కింద కేటాయించిన మొత్తం రూ.12,185 కోట్లలో ఇది 15 శాతంగా మంత్రి వివరించారు. ఈ నిధుల్లో ఎక్కువ శాతం రూ.281.98 కోట్లు ఉత్తర ప్రదేశ్‌కు కేటాయించారు. తరువాత బీహార్‌కు రూ. 154 కోట్లు, రాజస్థాన్‌కు రూ. 132 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 131 కోట్లు కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News