Tuesday, April 1, 2025

పాటియాలా మెడికల్ కాలేజీలో 80 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

Covid for 80 students at Patiala Medical College

చండీగఢ్ : పాటియాలా లోని ప్రభుత్వ రాజేంద్ర ఆస్పత్రి, మెడికల్ కాలేజీ డాక్టర్లు, విద్యార్ధులు , సిబ్బందితో సహా మొత్తం 80 మంది కరోనా బారిన పడ్డారు. 22 రెసిడెంట్ డాక్టర్లు, 34 వైద్య విద్యార్థులు, తొమ్మిది మంది ఫ్యాకల్టీ సభ్యులు, 15 మంది సిబ్బంది కరోనా బాదితులయ్యారని జిల్లా ఎపిడెమియోలజిస్టు డాక్టర్ సుమీత్ సింగ్ చెప్పారు. వీరంతా ఐసొలేషన్‌లో ఉంటారని, చెప్పారు. కొవిడ్ పరీక్షల తరువాత హాస్టల్ నుంచి దాదాపు 1000 మంది వైద్య విద్యార్థులను ఖాళీ చేయించడమైందని అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం పాటియాలా లోని థాపర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కి చెందిన 93 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ బయటపడింది. దీంతో కరోనా కేసుల వలయంలో అధ్వాన్నమైన జిల్లాగా పాటియాలా ముద్ర పడింది.. పంజాబ్ లో నమోదైన మొత్తం 419 కరోనా కేసుల్లో 34 శాతం పాటియాలా లోనే ఉన్నాయి. తాజాగా అక్కడ 143 కేసులు బయటపడ్డాయి. సోమవారం కరోనా పాజిటివిటీ రేటు 23.95 శాతంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News