Wednesday, January 22, 2025

మెదడు, అవయవాల్లో కొవిడ్ సుదీర్ఘ స్థావరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సార్స్ కొవి 2 వైరస్ (కొవిడ్) వైరస్ శరీరంలో మెదడుతోసహా ఇతర అవయవాల్లోనూ వ్యాపించి దాదాపు ఎనిమిది నెలల పాటు స్థావరమై ఉంటుందని అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. కొవిడ్ కారణం గానే ప్రాణాలు కోల్పోయిన రోగుల మృతదేహాల కణజాల నమూనాలను పరిశీలించగా ఈ విషయం వెల్లడైందన్నారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు ఆయా మృతదేహాల నమూనాలపై వీరు అధ్యయనం సాగించారు. అధ్యయనంలో తీసుకున్న రోగులంతా ఎలాంటి వాక్సినేషన్ తీసుకోని వారే. 11 మంది రోగుల్లో మెదడు, నాడీ వ్యవస్థపై సమగ్రంగా పరీక్షలు జరిగాయి. 38 రోగుల బ్లడ్ ప్లాస్మాలో కొవిడ్ పాజిటివ్, ముగ్గురిలో నెగిటివ్ కనిపించింది. మరో ముగ్గురి మృతదేహాల్లో ప్లాస్మా దొరకలేదు.

రోగుల్లో 30 శాతం మంది మహిళలు కాగా, వీరి నడివయసు 62.5 సంవత్సరాలు. మిగతా 64.1 శాతం రోగులకు మూడు లేదా అంతకన్నా సహ సంబంధ వ్యాధులు కనిపించాయి. కొవిడ్ లక్షణాలు ప్రారంభం నుంచి చివరకు మరణం వరకు మధ్యస్త విరామం 18.5 రోజులు. సాధారణంగా కొవిడ్ శ్వాసనాళానికి, ఊపిరితిత్తులకు సంక్రమించి వాటి కణాలను నాశనం చేస్తుంటాయి. కొవిడ్ లక్షణాలు ప్రారంభమైన తరువాత 230 రోజుల్లో 84 విభిన్న శరీర స్థానాల్లోను, ద్రవాల్లోను వైరల్ ఆర్‌ఎన్‌ఎ కనిపించగా, ఒకేఒక్క కేసులో మాత్రం వైరల్ ఆర్‌ఎన్‌ఎ ఒంటరిగా కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒక రోగి చిన్నమెదడులో , సెరిబెల్లమ్‌లో కొవిడ్ ఆర్‌ఎన్‌ఎ ప్రొటీన్ కనిపించింది. మరో ఇద్దరి రోగుల్లో వెన్నుపాము లోను, మెదడు లోని నాడీ మండలంలో ఆర్‌ఎన్‌ఎ ప్రొటీన్ కనిపించింది. ఈ అధ్యయనం చేపట్టక ముందు కొవిడ్ కేవలం శ్వాసకోశ వ్యవస్థకే పరిమితమవుతుంది తప్ప ఇతర అవయవాలకు, భాగాలకు సంక్రమించదని భావించాం. కానీ మెదడు, ఇతర అవయవాల్లో కూడా కొవిడ్ విస్తరిస్తుందని, కొన్ని నెలల పాటు అక్కడ తిష్ట వేస్తుందని అధ్యయనం ద్వారా తెలుసుకున్నామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సీనియర్ సైంటిస్టు డేనియల్ చెర్టో పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News