పరిస్దితి విషమించడంతో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు చికిత్స
మన తెలంగాణ, హైదరాబాద్ : సివిల్స్ సాధించాలని తపన మహరాష్ట్రకు చెందిన దేవానంద్ టేల్టోటే (26) బాగా సిద్దమై ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా పాసయ్యాడు. ఇంటర్వూ కోసం సిద్దమవుతుండగా అతడికి కోవిడ్ సోకింది. డిల్లీ , మహారాష్ట్ర చికిత్స చేసిన నయం కాకపోవడంతో ఎయిర్ అంబులెన్స్‌లో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ వైద్యులు అతని పరిస్దితి అంచనా వేసి, ఎక్మో సపోర్టుపై చికిత్స ప్రారంభించారు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లేందుకు రాచకొండ పోలీసు కమిషనర్ సాయం అందించి కిమ్స్ ఆసుపత్రిలో పడక ఇప్పిస్తానని చెప్పి, వారిని ఇక్కడకు రప్పించినట్లు కిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రిలోని గుండె ,ఊపిరితిత్తుల మార్పిడి కేంద్రంలో డా. సందీప్ అత్తావర్ నేతృత్యంలోని వైద్య బృందం అవిశ్రాంతంగా శ్రమించడంతో అతడు కోలుకోసాగాడు. సరిగ్గా ఇదే సమయంలో మరో సమస్య ఎదురైందని, మూడునెలకే దేవానంద్ మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో అతని కండరాలు బాగా పాడయ్యాయి. ఊపిరితిత్తుల సమస్య నుంచి కోలుకున్నాక, ఫిజియోథెరిపీ సాయం అందించారు. క్రమంగా ఎలాంటి సాయం అవసరం లేకుండా నడవడం, ఫిజియో సాయంతో వ్యాయామాలు చేయడం మొదలు పెట్టినట్లు వైద్యులు చెప్పారు.