Tuesday, November 5, 2024

దేశంలో సెప్టెంబర్ నుంచి కోవిడ్ వ్యాప్తి ఆర్ 1 కన్నా తక్కువే

- Advertisement -
- Advertisement -
Covid India's R-value Below 1 Since September
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ ( చెన్నై)పరిశోధకుల అధ్యయనం

ముంబై : కరోనా వ్యాప్తి తీవ్రతను ప్రతిబింబించే ఆర్ 1 విలువ సెప్టెంబర్ నుంచి దేశంలో తక్కువ గానే ఉంటోందని అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సోకిన వ్యక్తి సరాసరిన ఎంతమందికి ఇన్‌ఫెక్షన్ కలిగిస్తున్నాడో తెలియ చేసే సంఖ్యను రీప్రొడక్షన్ నెంబరు లేదా ఆర్‌అని అంటారు. మరోవిధంగా చెప్పాలంటే వైరస్ వ్యాప్తి తీవ్రత ఎలా ఉందో ఈ ఆర్ తెలియచేస్తుంది. 1 కన్నా ఆర్ విలువ చిన్నదిగా ఉంటే కొవిడ్ వ్యాప్తి నెమ్మదిగా ఉన్నట్టు. దీనికి భిన్నంగా 1 కన్నా పెద్దదిగా ఉంటే ప్రతిసారీ కరోనా సోకుతున్న వారి సంఖ్య ఎక్కువవుతున్నట్టు తెలుసుకోవాలి. చెన్నై కేంద్రంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ కు చెందిన పరిశోధకులు ఆర్ విలువను బట్టి కరోనా వ్యాప్తి స్థాయిని పరిగణిస్తున్నారు. టాప్ 10 రాష్ట్రాల్లో ఆర్ విలువను పరిశీలిస్తే అక్టోబర్ 18 వరకు క్రియాశీల కేసులు సంఖ్య ఆర్ 1 కన్నా తక్కువగానే ఉందని, అధ్యయనంలో తేలింది. అయితే కొన్ని నగరాల్లో క్రియాశీల కేసుల సంఖ్య పెరుగుతోంది.

కోల్‌కతాలో 1 కన్నా ఆర్‌విలువ ఎక్కువగా ఉంది. బహుశా ఇటీవల దుర్గాపూజ వేడుకల్లో జనం రద్దీగా పాల్గొనడం వల్ల కావచ్చునని పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న సీతభ్ర సిన్హా అభిప్రాయ పడ్డారు. బెంగళూరులో కూడా 1 కన్నా ఆర్ విలువ సెప్టెంబరు మధ్య నుంచి పెద్దదిగా ఉంది. చెన్నై, ముంబై, పుణె నగరాల్లో 1 కన్నా ఆర్ విలువ చిన్నదిగా ఉన్నట్టు తేలింది. సెప్టెంబర్ 25 అక్టోబర్ 18 మధ్యకాలంలో దేశం మొత్తం మీద ఆర్ విలువ 0.90 గా ఉన్నట్టు తేలింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 3 వరకు ఆర్ విలువ 1.11 కాగా, అప్పటి నుంచి తగ్గడం ప్రారంభమైంది. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు ఆర్ విలువ 0.94 గా ఉంది. సెప్టెంబర్ 1115 మధ్యకాలంలో 0.86కాగా, సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు 0.92, సెప్టెంబర్ 17 21 మధ్య కాలంలో 0.87 గా అధ్యయనంలో బయటపడింది. మార్చి నుంచి మే వరకు కరోనా సెకండ్ వేవ్ ముమ్మరంగా సాగిన తరువాత రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News