Friday, November 22, 2024

మహామహులకు ‘మహమ్మారి’

- Advertisement -
- Advertisement -
Covid infected CMs Ministers And celebrities
కొవిడ్ బారిన పడుతున్న సిఎంలు,మంత్రులు,సెలబ్రిటీలు

హైదరాబాద్ : కరోనా మహమ్మారి.. ఎవరినీ వదలడంలేదు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సెలబ్రిటీలు అందరూ వైరస్‌బారిన పడుతున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బిహార్‌ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌లు వైరస్‌బారిన పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌బ్మొ కూడా కొవిడ్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొవిడ్ బారిన పడ్డారు.తన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు నడ్డా పేర్కొన్నారు. వైద్యాధికారుల సూచన మేరకు స్వీయనిర్భందంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇటీవల కేంద్రమంత్రులు భారతి పవార్, అజయ్ భట్ కొవిడ్, మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్ రాయ్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోత్, బిజెపి ఎంపీలు మనోజ్ తివారీ, వరుణ్ గాంధీ తదితరులు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

సెలబ్రిటీలకు కరోనా

ప్రముఖ సినీ హీరో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇటీవల కరోనా బారినపడ్డారు. తాను ఐసోలేషన్‌లో ఉన్న సమయంలోనే సోదరుడు రమేష్‌బాబు మృతిచెందగా, అంత్యక్రియలు కూడా హాజరుకాలేకపోయారు. అలాగే ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్, మంచు లక్ష్మి, మనోజ్, శోభన, త్రిష, కుష్బూ తదితరులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్, నటి రేణుదేశాయ్, ఆమె కుమారుడు అఖీరానందన్‌లు కరోనా బారినపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News