Wednesday, January 22, 2025

పురుషుల ఇంద్రియ నాణ్యతపై కొవిడ్ ప్రభావం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సార్స్‌-సిఓవి-2 వైరస్ సంక్రమణ పురుషుల ఇంద్రియంపై నెగటివ్ ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో వెల్లడయింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పరిశోధకులు 30 మంది పురుషులపై చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయింది. ఈ పరిశోధనను పాట్నాకు చెందిన ఎయిమ్స్ పరిశోధకుల బృందం చేపట్టింది. కొవిడ్-19 మల్టీఆర్గన్ డ్యామేజికి దాదితీస్తుందని వారు కనుగొన్నారు. అదికూడా వృషణ కణజాలంలో సమృద్ధిగా ఉండే యాంజియోటెన్సిన్‌కన్వర్టింగ్ ఎంజైమ్2 రిసెప్టర్(ఏసిఈ2)ద్వారా అని కనుగొన్నారు. ఏసిఈ2 సార్స్ సిఓవి2 స్పైక్ ప్రోటీన్‌కి గ్రాహకంగా పనిచేస్తుంది. దీని ద్వారా వైరస్ హోస్ట్ కణాలలోకి ప్రవేశిస్తుంది. అయితే వీర్యంలో సార్స్‌సిఓవి2 షెడ్డింగ్ గురించి తక్కువ సమాచారమే అందుబాటులో ఉంది.

ఎయిమ్స్ పరిశోధకులు వీర్యం నాణ్యత, వీర్యం డిఎన్‌ఏ ఫ్రాగ్మెంటేషన్ సూచీపై వ్యాధి ప్రభావాన్ని విశ్లేషించారు, ఇది డిఎన్‌ఏ సమగ్రతను, నష్టాన్ని ప్రతిబింబిస్తుంది.తద్వారా సంభావ్య స్మెర్మ్ నష్టాన్ని గుర్తించింది. పాట్నా ఎయిమ్స్‌లో 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న ముప్పై మంది కొవిడ్-19 రోగులపై ఈ పరిశోధన చేపట్టారు. ఈ అధ్యయనం 2020 నుంచి 2021 వరకు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News