Tuesday, November 5, 2024

కొవిడ్ బీమా గడువు మరో 6 నెలలు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Covid insurance extension for another 6 months

న్యూఢిల్లీ : కొవిడ్ సంబంధిత విధుల్లో పాలుపంచుకునే వైద్య ఆరోగ్య సిబ్బందికి కేంద్ర ఆరోగ్యబీమా పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది. దీంతో ఏప్రిల్ 10 నుంచి మరో 180 రోజులు వైద్య ఆరోగ్య సిబ్బందికి ఈ బీమా వర్తించనున్నది. ఇక ఈ పథకం కింద ఇప్పటివరకు 1905 మంది బాధితులకు చెల్లింపులు జరిపినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలకు బీమా సదుపాయాన్ని కలిగించేందుకు 2020 మార్చి 30 నుంచి ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ (పిఎంజికెపి) ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా కొవిడ్ సంబంధిత విధుల్లో ఎవరైనా మరణిస్తే వారికి రూ. 50 లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు , ప్రైవేట్ హెల్త్ వర్కర్లతో సహా కొవిడ్ బాధితులకు నేరుగా సేవలందించే 22.12 లక్షల మందికి ఈ బీమా సౌకర్యాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 1905 మంది ఆరోగ్య కార్యకర్తలకు బీమా క్లెయిమ్ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News