Sunday, December 22, 2024

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు

- Advertisement -
- Advertisement -

Covid Key instructions of Center to States

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. దేశంలో 15వేల పైచిలుకు కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నందున్న నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో జనం ఒక్క చోట గుమికూడకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించాలని రాష్ట్రాలను కోరింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం దేశంలో కొత్తగా 16,561 రోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసులు 1,23,535 కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 49 మరణాల నమోదయ్యాయి.

ఇక, ఈ వేడుకల్లో భాగంగా ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం ప్రతి జిల్లాలో ఒక ప్రముఖ ప్రదేశంలో ‘స్వచ్ఛ భారత్’ ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పింది. దాన్ని పౌరులంతా పరిశుభ్రంగా ఉంచడానికి 15 నుంచి 30 రోజుల పాటు ప్రచారం నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా తెలియజేసింది. పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించేందుకు చెట్ల పెంపకం కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలను హోం మంత్రిత్వ శాఖ కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News