Monday, December 23, 2024

24 రోజులలో 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Covid killed eight members within 24 days in Lucknow

యుపి యాదవ్ ఇంట్లో కరోనా కాటు

లక్నో : ఇక్కడి శివార్లలోని ఇమాలియా పూర్వ గ్రామంలో ఆ యాదవ్ కుటుంబపు సువిశాలమైన ఇల్లు నిరుడు కొవిడ్ మిగిల్చి వెళ్లిన మృత్యు భయానకానికి నిదర్శనం అయింది. మిగిలిన కుటుంబ సభ్యులు ఇద్దరు ముగ్గురికి పుట్టెడు విషాదం నింపింది. ఉమ్మడి కుటుంబంగా కలివిడి ఉండే ఈ ఇంట్లో గత ఏడాది 24 రోజుల వ్యవధిలో ఎనమండుగురు కొవిడ్ కాటుకు బలయ్యారు. లంకంత ఇంటిలో ఇప్పుడు శ్మశాన వైరాగ్యం నెలకొంది. ఏ గదిలోకి వెళ్లినా, హాల్‌లో కూర్చున్నా నిలబడ్డా గతించిన వారి జ్ఞాపకాలు మిగిలిన వారిని వెంటాడుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ ఇల్లు సందడిగా కళకళలాడుతూ ఉండేది. అయితే ఇప్పుడు బోసిపోయినట్లు నిలిచింది. అప్పట్లో కొవిడ్‌తో ఓ మరణం, అంతిమసంస్కారం ఈ విధంగా నెలరోజుల వరకూ దాదాపు మూడురోజులకోసారి సాగింది.

కొవిడ్‌తో మృతి చెందిన వారిలో ఇద్దరు సోదరిలు, వారి నలుగురు సోదరులు వారి తల్లి, వారి మేనత్త ఉన్నారు. వీరిలో కొందరు ఇంట్లోనే కరోనాతో కన్నుమూశారు. కొందరు ఆసుపత్రులలో అత్యవసర చికిత్స పొందుతూ శ్వాస తీసుకోవడం కష్టం అయి చనిపొయ్యారు. ఇప్పుడు ఈ కుటుంబంలో సీమాసింగ్ యాదవ్ మిగిలారు. తన 45 ఏండ్ల భర్త నిరంకర్ సింగ్ యాదవ్ ఓ రైతు అని గత ఏడాది ఎప్రిల్ 25న ఆరురోజులు ఆసుపత్రిలో చికిత్స తరువాత కూడా కోలుకోలేని దశలో ప్రాణాలు విడిచారని సీమాసింగ్ బావురుమన్నారు. తన భర్త చిత్తరువును చూపారు. తన ఇద్దరు కుమారుల చదువులు ఎట్లాసాగించాలనేదే తన సమస్య అని తెలిపారు. ఆమె పెద్ద కొడుకు ఇప్పుడు హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేస్తున్నాడు. చిన్నవాడు ఇంటర్ రాశాడు. పొలం పనులలో సహకరిస్తున్నాడని ఆమె చెప్పారు. కుటుంబంలో ఇంత మంది ఆ మహమ్మారితో చనిపోయిన తరువాత కొన్ని సందర్భాలలో తను బతికి చేసేదేముంది అన్పించేదని అయితే ఇప్పుడు కేవలం తన కొడుకుల కోసం బాధను దిగమింగుకుంటూ గడుపుతున్నానని తెలిపారు. తనకు ఏమి జరిగినా వారి భవిష్యత్తు బాగుండాలనే తపనతో వారిని చదివిస్తున్నానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News