Wednesday, January 22, 2025

కొవిడ్ సోకిన ఆరునెలల్లో బాధితులకు తీవ్ర ఛాతీ నొప్పి

- Advertisement -
- Advertisement -

అమెరికా ఇంటర్‌మౌంటైన్ హెల్త్ అధ్యయనం వెల్లడి

వాషింగ్టన్ : కొవిడ్ 19 రోగులు ఇన్‌ఫెక్షన్ తరువాత ఆరునెలల నుంచి ఏడాది లోగా తీవ్రమైన ఛాతీనొప్పికి గురయ్యే రిస్కు ఉంటోందని, ఇది భవిష్యత్తులో గుండెకు సంబంధించిన సమస్యలకు సంకేతమని అమెరికాకు చెందిన ఇంటర్‌మౌంటైన్ హెల్త్ అధ్యయనం వెల్లడించింది. అమెరికా లోని వయోవృద్దుల్లో దాదాపు 19 శాతం మంది ఇదివరకు కొవిడ్ 19 పాజిటివ్ సోకిన వారుగా పరీక్షలో బయటపడినవారు సుదీర్ఘకాల కొవిడ్ బాధితులుగా కొనసాగుతున్నారని, ఇన్‌ఫెక్షన్ ప్రాథమిక దశ తరువాత నాలుగు వారాలు లేదా అంతకన్నా ఎక్కువకాలం ఛాతీనొప్పి లక్షణాల సంకేతాలు అనుభవిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది.

అమెరికా లోని ఇంటర్‌మౌంటైన్ హెల్త్ కు చెందిన పరిశోధకులు ఈమేరకు 1,50, 000 మంది కొవిడ్ రోగులను గుండె సంబంధ సమస్యలను తెలుసుకోడానికి అధ్యయనం లోకి తీసుకున్నారు. ఎవరైతే కొవిడ్ పాజిటివ్‌గా పరీక్షలో తేలారో వారికి ఇన్‌ఫెక్షన్ తరువాత ఆరు మాసాల నుంచి ఏడాది లోగా అత్యధిక స్థాయిల్లో ఛాతీ నొప్పి కనిపించింది. ఇన్‌ఫెక్షన్ తీవ్రదశ ఉన్నప్పటికీ, చాలా మంది కొవిడ్ రోగులు ఈ లక్షణాలను కలిగి ఉన్నారని ఇంటర్ మౌంటైన్‌కు చెందిన కార్డియో వాస్కులర్ ఎపెడెమియోలాజిస్ట్, అధ్యయన ప్రధాన పర్యవేక్షకులు హెయిడీ టి. మే వెల్లడించారు.

తమ అధ్యయనంలో గుండెపోటు, పక్షవాతం (స్ట్రోక్) వంటి ప్రధాన సంఘటనలు చెప్పుకోతగినంతగా కనిపించక పోయినప్పటికీ, ఛాతీ నొప్పి మాత్రం నిరంతర సమస్యగా కనిపించిందని చెప్పారు. భవిష్యత్తులో గుండెకు సంబంధించిన సమస్యలకు ఇది సంకేతమని పేర్కొన్నారు. అమెరికా న్యూ ఓరియన్స్ లో ఆదివారం నిర్వహించిన అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియోలజీ 2023 సైంటిఫిక్ కాన్ఫరెన్సులో ఈ అధ్యయనం సమర్పించడమైంది.

భారీ స్థాయిలో నిర్వహించిన ఈ అధ్యయన సమీక్షలో ఇంటర్‌మౌంటైన్ హెల్త్ లోని రోగులను మూడు గ్రూపులుగా విభజించి పరిశోధకులు పోల్చి చూశారు. ఆరు మాసాలు, ఏడాది విరామంలో కొవిడ్ రోగుల్లో ఛాతీ నొప్పి అత్యధిక స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. అయితే గుండె సమస్యలు మాత్రం పెరగలేదు. ఇప్పటివరకు లక్షణాలను చాలా కష్టసమస్యలుగా పరిగణించనక్కర లేదని , కానీ కాలానుగుణంగా పునస్సమీక్షించుకోవలసిన అవసరం ఉందని మే చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News