Sunday, November 17, 2024

కొత్త వేరియంట్ అలజడి

- Advertisement -
- Advertisement -

Covid new variant turmoil in Britain, Russia, Australia

బ్రిటన్ సహా పలుదేశాల్లో విజృంభణ

లండన్ : బ్రిటన్ సహా పలుదేశాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియాలో కొవిడ్ కొత్త వేరియంట్ అలజడి రేపుతోంది. ఇప్పటికే ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న డెల్టా వేరియంట్ మరో వేరియంట్‌గా మారింది. డెల్టా ప్లస్ (ఏవై 4.2)గా వ్యవహరిస్తున్న ఈ వేరియంట్‌ను ‘పరిశీలనలో ఉన్న వేరియంట్’గా బ్రిటన్ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. డెల్టాను మించిన వేగంతో ఈ వేరియంట్ ప్రజలకు వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, డెల్టా వేరియంట్‌తో పోలిస్తే డెల్టాప్లస్ తీవ్రత తక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరగడానికి కారణం మహమ్మారి వైరస్‌లో మార్పులా? లేదంటే సంక్రమిత వ్యాధులకు అనువైన వాతావరణం ఏర్పడడమా? అన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 6 శాతం వరకూ డెల్టా ప్లస్ వేరియంట్ వేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ నెల 20న వచ్చిన కేసుల్లో 15వేల 120 కేసులు డెల్టా ప్లస్‌వి ఉన్నాయంటున్నారు. మరోవైపు రష్యా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేసుకున్న వారికే అన్ని ఆంక్షల నుంచి సడలింపులను ఇస్తూ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. టీకా వేసుకోని వారిపై మాత్రం ఆంక్షలను యాధావిధిగా విధించింది. ఇటు రష్యాలో తాజా 37వేల 678 కేసులు నమోదైతే ఒక వెయ్యి 75 మంది బలయ్యారు. గత సెప్టెంబర్‌తో పోలిస్తే ఇప్పుడు కేసులు 70 శాతం, మరణాలు 33 శాతం ఎక్కువగా నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ లోనూ 614 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో థర్డ్‌వేవ్ పిడుగు తప్పదన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News