- Advertisement -
లక్నో: భారత్ లో కరోనా విజృంభిస్తున్న వేళ పలుచోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తల తీసుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయు జిల్లాలో ఇలాంటి ఓ సంఘటనే చోటుచేసుకుంది. కరోనా నేపథ్యంలో అంత్యక్రియలకు కేవలం 20 మందే పాల్గొనాలని యుపి సర్కార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పరిమిత సంఖ్యలోనే ప్రజలు హాజరు కావాలనే ఆంక్షలు విధించింది. మత గురువు అబ్దుల్ హామీద్ మహమ్మద్ సాలిమూల్ ఖాద్రీ ఆదివారం మృతి చెందారు. ఆయన మరణ వార్త విన్న చుట్టుపక్కల జనాలు వేల సంఖ్యలో అంతిమయాత్రకు హాజరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Covid norms flouted in Uttar Pradesh Budaun
- Advertisement -