ముంబై: మహారాష్ట్రలో కరోనా రోగులు పరిస్థితి దారుణంగా తయారైంది. కనీస వైద్య సదుపాయాలు అందక రోగులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అలాంటి విషాద సంఘటన మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని చాంద్వాడ్ లో గురువారం చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తిని అతని భార్య ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. దవాఖానలో పడకలు లేవని సిబ్బంది చేర్చుకోలేదు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండడంతో కనీసం ఆక్సిజన్ అయిన పెట్టాలని భార్య వేడుకుంది. ఆస్పత్రి సిబ్బంది స్పందించేలోపే కరోనా రోగి భార్య ఒడిలో కన్నుమూశాడు. మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు భారీగా నమోదు కావడంతో ఆస్పత్రులన్నీ కోవిడ్ రోగులతో నిడిపోతున్నాయి. దీంతో కొత్తగా వైరస్ బారినపడిన వారి పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి వైద్యం అందక మృత్యువాతపడుతున్నారు. దీంతో ఆందోళన పరిస్థితులు నెలకొంటున్నాయి.
Covid patient dies outside hospital in front of wife in nashik