- Advertisement -
లండన్: రక్తం గడ్డ కట్టడం అనేది ఫైజర్,ఆస్ట్రాజెనెకా(కొవిషీల్డ్) వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో కంటే కొవిడ్19 బారిన పడినవారిలోనే అధికమని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. యుకెలో మొదటి డోసు తీసుకున్న 2.9 కోట్లమంది డేటా ఆధారంగా నిర్వహించిన అధ్యయన వివరాల్ని బ్రిటీష్ మెడికల్ జర్నల్ (బిఎంజె) శుక్రవారం ప్రచురించింది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో అరుదుగా రక్తం గడ్డకట్టిన సమస్యలు రావడం, కొందరు మరణించిన ఘటనలతో వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో సురక్షితం కాదని స్పష్టమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవిడ్19 బారిన పడినవారితో పోలుస్తూ ఈ రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారిపై మరోసారి అధ్యయనం నిర్వహించారు.
- Advertisement -