Thursday, December 5, 2024

కొవిడ్ రోగులు వెంటనే సర్జరీ చేయించుకోరాదు: ఐసిఎంఆర్

- Advertisement -
- Advertisement -

Covid patients should not surgery immediately

ఆరు వారాలు ఆగాలి,
సర్జరీకి ముందు పాజిటివ్ వచ్చినా ఆందోళన వద్దు
తిరిగి కొవిడ్ వచ్చినా 102 రోజుల తరువాతనే నిర్ధారణ

న్యూఢిల్లీ : కొవిడ్ నుంచి కోలుకున్న రోగులు వెంటనే సర్జరీలు చేయించుకోరాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్) సూచించింది. అత్యవసరం కాని సర్జరీలను కొవిడ్ నుంచి కోలుకున్న ఆరు వారాల తరువాతే చేయించుకోవాలని , అలా అయితేనే వారు త్వరగా కోలుకోగలుగుతారని వివరించింది. ఇలాంటి రోగులు సర్జరీకి ముందు ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ వచ్చినా ఆందోళన చెందాల్సిందేమీ లేదని శరీరంలో మిగిలిపోయిన, హాని చేయని, చనిపోయిన వైరస్ కారణంగా పరీక్షల్లో పాజిటివ్‌గా వస్తాయని ఐసిఎంఆర్ వివరించింది. ఒక వేళ కరోనా తిరిగి ఇన్‌ఫెక్షన్ అయితే 102 రోజుల తరువాతనే నిర్ధారణ అవుతుందని, అందువల్ల ఇలాంటి సర్జరీలను వాయిదా వేయడమే మంచిదని అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ సంజయ్ పూజారి సూచించారు. అయితే అత్యవసర సర్జరీలు తప్పనిసరి అయితే ముందు జాగ్రత్తలతో నిర్వహించాలని ఆయా రోగుల గుండె,ఊపిరితిత్తులను పరిశీలించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News