Saturday, November 23, 2024

అఖిలేష్ యాదవ్ భార్య ఎంపి డింపిల్‌కు కొవిడ్ పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Covid positive for Akhilesh Yadav's wife MP Dimple

లక్నో : యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య ఎంపి డింపిల్ యాదవ్ కు కొవిడ్ పాజిటివ్ సోకింది. తాను పూర్తిగా వ్యాక్సినేషన్ పొందినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ కొవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చిందని డింపిల్ చెప్పారు. స్వీయ ఐసొలేషన్‌లో తానున్నానని తెలిపారు. ఇటీవల తనను కలుసుకున్న, చేరువగా ఉన్నవారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే అఖిలేష్ యాదవ్ టీకా వేయించుకున్నారో లేదో తెలీదు. కొన్ని నెలలుగా యుపి ఎన్నికలకు సంబంధించి అఖిలేష్ ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News