- Advertisement -
దేశం లోనే మొదటిసారి…
కోల్‌కతా : కరోనా పాజిటివ్ వచ్చిన ఓ క్యాన్సర్ రోగి గొప్పమనసు చాటుకున్నారు. తన శరీరం సమాజం కోసం ఉపయోయగపడాలనుకున్నాడు. కరోనాపై పరిశోధన కోసం మరణానికి ముందే తన దేహాన్ని దానం చేశాడు. కొవిడ్‌పై పరిశోధనలకు తన శరీరాన్ని అప్పగించిన దేశం లోని మొట్టమొదటి వ్యక్తి ఈయనేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కోల్‌కతాలో నివసించే నిర్మల్ దాస్ (89) చాలా కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ మధ్యే ఆయనకు కరోనా కూడా సోకింది. దీంతో తన శరీరం ఇతరుల మేలు కోసం ఉపయోగించాలని భావించాడు. మరణానికి ముందే వైద్య పరిశోధనల కోసం తన దేహాన్ని దానం చేశాడు. కాగా నిర్మల్‌దాస్ ఈమధ్యే మృతి చెందగా, ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ డిపార్టుమెంట్‌కు ఆయన శరీరాన్ని శనివారం అప్పగించారు.
- Advertisement -