Tuesday, November 5, 2024

రేషన్ పంపిణీపై కోవిడ్ ఆంక్షలు సడలింపు

- Advertisement -
- Advertisement -

వేలిముద్ర వేస్తేనే సరుకులు
ఈనెల నుంచి అమలు

Difficulties in registering new names for ration card

మనతెలంగాణ/హైదారబాద్: వేసవి కాలం సమీపిస్తోంది. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ వ్యాధుల తీవ్రత తగ్గిపోయింది. ఇంతకాలం అమల్లో ఉన్నకోవిడ్ నిబంధనలను ప్రభుత్వం తొలగిస్తూ వస్తోంది. రాష్ట్రంలో చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీలో కూడా కోవిడ్ ఆంక్షలకు ప్రభుత్వం సడలింపునిచ్చింది. ఈ నెల నుంచి రేషన్ పంపిణీలో లబ్ధిదారుల వేలిముద్రలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలు 87లక్షలకు పైగా ఉన్నాయి. ఈ కుటుంబాల్లో 2.80కోట్ల మంది ప్రభుత్వం నుంచి ప్రతినెల రేషన్ సరుకులు పొందుతున్నారు.ప్రత్యేకించి ప్రభుత్వం ప్రతినెల వీరికి 1.67లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ ప్రబలకుండా రేషన్ పంపిణీ సందర్భంగా ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేస్తూ వచ్చింది. క్యూలో సామాజిక దూరం పాటింపు.

మాస్క్‌లు ధరించటం, శానిటైజేషన్‌తో చేతులు శుభ్రంగా ఉంచుకోవటం వంటివి అమలు చేసింది. అంతేకాకుండా డిజిటల్ మిషన్‌పై వేలిముద్రల గుర్తింపు ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ విధానంలో వేలిముద్రల ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్న అభిప్రాయంతో ఈ వేలిముద్రల విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ స్థానంలో కంటిపాపల ఆధారంగా లబ్దిదారులను గుర్తించే ఐరిష్ విధానం తప్పని సరిచేసింది. అంతే కాకుండా మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటిపి నెంబరు చెబితే బియ్యం పంపిణీ చేసే వెసులుబాటు కల్పించింది. కోవిడ్ ఆంక్షల కారణంగా బియ్యం పంపిణీలో చేపట్టిన విధానాలు అక్రమాలకు అవకాశం కల్పిస్తున్నాయన్న ఆరోపణలు కూడా రావడంతో ప్రభుత్వం రేషన్ పంపిణీ కార్యక్రమాలను సమీక్షించింది. కోవిడ్ వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గిపోవటంతో తిరిగి వేలిముద్రల విధానం అమల్లోకి తెస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల నుంచి రేషన్ పొందాలంటే ఇక వేలిముద్రలు వేయాల్సిందే అని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News