Wednesday, January 22, 2025

రెండో డోసు 10 జిల్లాల్లో 100%

- Advertisement -
- Advertisement -
Covid second dose 100% in 10 districts
రాష్ట్రంలో అర్హులైన వారిలో 92 శాతం మందికి టీకాలు

హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌కు విశేష స్పందన లభిస్తోంది. కొవిడ్ టీకాలపై ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలతో అన్ని వర్గాలు రెండు డోసులు తీసుకునేందుకు ముందుకువస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 92 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. 33 జిల్లాల్లో వ్యాక్సిన్ తీసుకునేందుకు మొత్తం 27,76, 7000 మంది అర్హులు ఉండగా, వారిలో 29,27,4329(105 శాతం) మంది మొదటి డోసు తీసుకోగా, 25,62,5095(92 శాతం) మంది రెండు డోసులు తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే మొదటి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి కాగా, త్వరలోనే రెండో డోసు కూడా 100 శాతం పూర్తి కానుంది. ప్రస్తుతం కరీంనగర్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి కాగా, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాలు, వరంగల్,ములుగు, నల్గొండ జిల్లాల్లో 95 శాతం రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది.

పిల్లల టీకాలకు విశేష స్పందన

రాష్ట్రంలో పిల్లల టీకాలకు విశేష స్పందన కనిపిస్తోంది. 15 నుంచి 17 ఏళ్ల వయసు గల పిల్లలకు జనవరి 3 నుంచి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, అర్హులైన వారిలో 83 శాతం మొదటి డోసు, 41 శాతం రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News