Saturday, November 23, 2024

మే 31 వరకు సెకండ్ డోసు డ్రైవ్ కొనసాగుతుంది…!

- Advertisement -
- Advertisement -

Covid second dose drive will continue until May 31

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే టీకా తీసుకోవచ్చు
దశల వారీగా అందరికీ వ్యాక్సిన్ అందిస్తాం
నైట్ కర్ఫూ, లాక్‌డౌన్‌తో వైరస్ తీవ్రత తగ్గుతుంది
ఆసుపత్రుల అడ్మిషన్లు, మరణాలూ తగ్గుముఖం పట్టాయి
సడలింపు 4 గంటల సమయంలో కొందరు నిబంధనలు పాటించడం లేదు
ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత లేదు
వ్యాధి లక్షణాలు ఉన్న వారు మాత్రమే టెస్టుకు వెళ్లాలి
రెమ్‌డెసివిర్, టొసిలిజుమబ్ మందులకు ప్రత్యామ్నయాలు ఉన్నాయి
70 లక్షల ఇళ్లల్లో సింప్టమ్స్ సర్వే నిర్వహించాం
ఆక్సిజన్, ప్రాణదార మందుల వినియోగానికి ప్రత్యేక కమిటీలు వేస్తున్నాం
ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి 3 బ్లాక్ ఫంగస్ కేసులు గాంధీకి వచ్చాయి
అర్హత కలిగిన వారంతా రోగులకు సేవలందించేందుకు ముందుకు రావాలి
మీడియాతో హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు, డిఎంఇ డా రమేష్‌రెడ్డిలు వెల్లడి

హైదరాబాద్: రాష్ట్రంలో మే 31 వరకు సెకండ్ డోసు డ్రైవ్ కొనసాగుతుందని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈనెల చివరి వరకు సుమారు 20 నుంచి 25 లక్షల మంది రెండో డోసుకు అర్హత కలిగి ఉంటారన్నారు. వీరంతా ప్రభుత్వ కేంద్రాలకు వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా టీకా పొందవచ్చన్నారు. అయితే ప్రస్తుతం కేవలం రెండో డోసును మాత్రమే ఇస్తుండగా, అతి త్వరలో అందరికీ వ్యాక్సిన్ అందిస్తామన్నారు. కేంద్రం పంపిణీ చేసే డోసుల సంఖ్య తక్కువగా ఉండటం వలనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం పెట్టిన నైట్ కర్ఫూ, లాక్‌డౌన్ వలన కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. కానీ కొంత మంది ఇప్పటికీ నిర్లక్షంగా వ్యవహరించడం బాధకరమన్నారు. నిత్యావసర వస్తువుల కోసం సడలింపులు ఇచ్చిన 4 గంటల్లో కరోనా నిబంధనలు పాటించకుండానే చాలా మంది గూమికూడతున్నారని, ఇది వైరస్ వ్యాప్తికి కారణమవుతుందన్నారు.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ఆయన గురువారం డిఎంఇ డా రమేష్‌రెడ్డితో కలసి కోఠి కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా డిహెచ్ మాట్లాడుతూ..ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్ కొరత లేదన్నారు. అయితే ఆక్సిజన్ అంశంపై అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేక కమిటీలు వేస్తున్నామన్నారు. దీంతో సకాలంలో ఆక్సిజన్ అందించడం, లీకేజ్ వంటి వాటిని అరికట్టవచ్చన్నారు. అంతేగాక రెమ్‌డెసివిర్, టొలిసిజూమబ్ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. దీంతో పాటు వీటిని ప్రత్యామ్నయ మందులను కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రెమ్‌డెసివిర్ తప్పనిసరి అని ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లపై ఒత్తిడి తేవొద్దన్నారు. దీనికి బదులుగా ప్రెగ్లైటెడ్ ఇంటర్ ఫెర్రన్, టొసిలిజూమబ్‌కు బదులు బారిసిటినిబ్ లేదా తోఫా సిటినిబ్ వంటివి వాడాలని సూచించారు.

25 వేల టీంలతో ఇంటింటికి సర్వే…

రాష్ట్ర వ్యాప్తంగా సింప్టమ్స్ సర్వే విజయవంతంగా కొనసాగుతుందని డిహెచ్ చెప్పారు. సుమారు 25 వేల టీంలతో ఇప్పటి వరకు 70 లక్షల ఇళ్లల్లో సర్వే చేశామన్నారు. వీరిలో లక్షా 70 వేల మందికి పైగా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, లక్షా 59వేలకు పైగా కిట్లు ఇచ్చామన్నారు. అంతేగాక అన్ని ఆసుపత్రుత్లో కొవిడ్ ఓపిని కూడా నిర్వహిస్తూ కిట్లను ఇస్తున్నామన్నారు. మరోవైపు లక్షణాలు తేలిన వెంటనే సకాలంలో మందులు వాడితే హాస్పిటలైజేషన్ అవసరం ఉండదన్నారు. అంతేగాక హోం ఐసోలేషన్ ఉన్నోళ్లంతా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకోవాలన్నారు. దీంతో సదరు పేషెంట్‌కు ప్రాణాపాయం తప్పుతుందన్నారు. అవసరం లేని వారు కూడా ఆసుపత్రుల్లో చేరి బెడ్లకు కృత్రిమ కొరత సృష్టించొద్దన్నారు.

అత్యవసరం ఉంటేనే…

కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యవసరమైతేనే బయటకు రావొద్దని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అంతేగాక పెళ్లిళ్లు, అంత్యక్రియలు, ఆటపాటలు, విందు, వినోదాలు, సభలు, సమావేశాలు వంటికి దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం వీటికి పాటించాలన్నారు. ఇవేమీ ప్రాణాల కంటే ఎక్కువ కాదన్నారు. గతేడాది నుంచి 24 గంటల పాటు నిర్వీరామంగా శ్రమిస్తున్న వైద్యసిబ్బందికి మరిన్ని రోజులు సహకరించాలని ఆయన కోరారు. పరిస్థితి చేయి దాటిపోయే వరకు తీసుకురావొద్దన్నారు.

రోగులకు సేవలందించేందుకు ముందుకు రావాలిః డిఎంఇ డా రమేష్‌రెడ్డి

కరోనా విపత్కర పరిస్థితుల్లో అర్హత కలిగిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రోగులను సేవలందించేందుకు ముందుకు రావాలని డిఎంఇ డా రమేష్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లోని ఖాళీ పోస్లును టెంపరరీ విధానంతో నింపుతున్నామన్నారు. అయితే కొవిడ్ ఆసుపత్రుల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదన్నారు. ట్యాంక్‌లో లెవల్ తగ్గగానే ఆయా సంస్థలకు ఆటోమెటిక్‌గా అలెర్డ్ వెళ్తుందన్నారు. కొన్ని హాస్పటళ్లల్లో ఆక్సిజన్ కాన్సట్రేటర్లను వాడాలని నిర్ణయించామన్నారు. వీటిని ట్రయోజీ, వార్డులలో ఏర్పాటు చేస్తామన్నారు. అంతేగాక 51 ఆక్సిజన్ జనరేటర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బ్లాక్ ఫంగస్‌తో టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ వస్తుందనేది అవాస్తవమని చెప్పారు.

కేవలం స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వలన రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో మాత్రమే ఈ బ్లాక్ ఫంగస్ వస్తుందన్నారు. అంతేగాక ఆక్సిజన్ ఛాంబర్సు శుభ్రపరచకుండా వినియోగిస్తే కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు గాంధీలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స జరుగుతుందన్నారు. అవి కూడా ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చాయని స్పష్టం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు తేలితే గాంధీకి పంపిస్తున్నారని, ఇది సరైన పద్ధది కాదన్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చే టొసిలీజూమాబ్ ఇంజక్షన్ రిక్వెస్ట్‌లను చూస్తే బాధగా ఉందన్నారు. కొందరి వైద్యులకు ఏవరికి ఏం వాడాలో తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. ఇప్పటి వరకు పిఎం కేర్ కింద 1300 వెంటిలేటర్‌లు వస్తే 100 పనిచేయడం లేదని తేల్చిచెప్పారు. అంతేగాక ఆసుపత్రుల్లో కొవిడ్ బయో వ్యర్ధాలను ప్రత్యేక మెడికల్ టీం ద్వారా ఈక్విప్మెంగ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.

వైద్యశాఖ సూచించే ప్రత్యామ్నయం మందులు

మందు క్లాస్ ప్రత్యామ్నయం
రెమ్‌డెస్‌విర్ యాంటీవైరల్ పెగ్లైటెడ్ ఇంటర్‌ఫెర్రాన్‌ఆల్ఫా
డాక్సిసైక్లిన్ యాంటీబాడిక్ అజిత్రోమైసిన్
లిపొసోమల్ యాంటీఫంగల్ కాన్వెన్షల్ ఆంపోటెరిసీయన్, ఓరల్ పోసాకానోజోల్
హెఫారిన్ యాంటీకాంగ్లెంట్ ఆప్రిక్సిబ్యాన్
మిథైల్ ప్రెడ్నిసొలైన్ స్టెరాయిడ్ డెక్సామెథాసోన్
టొసిలిజూమాబ్ యాంటీసైటోకైన్ బారిసిటినిబ్, తోఫాసిటినిబ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News