Monday, January 20, 2025

అమెరికాలో 70 శాతం ఇళ్లకు వ్యాపించిన కోవిడ్-19

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: కోవిడ్-19 వ్యాధి బారిన పడిన పిల్లలు అతి తక్కువగా ఉన్నారు, ఓ బిడ్డ ద్వారా సంక్రమించిన సార్స్‌ సివోవి-2 అమెరికాలోని 70.4 శాతం, అంటే దాదాపు 850000 ఇళ్లకు వ్యాపించింది. జెఎఎంఎ నెట్‌వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన అధ్యయనం, చిన్న పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది.

బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పరిశోధకుల నేతృత్వంలోని బృందం 1391095 మంది సభ్యులున్న 848591 గృహాలకు స్మార్ట్‌ఫోన్‌ను అనుసంధానించిన థర్మామీటర్‌లను అందించింది. వారు 2019 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు 23153925 ఉష్ణోగ్రత రీడింగ్‌లను తీసుకుంది. జ్వరాలు సంక్రమణలకు దారితీసాయి.

38787 ఇళ్లకు వ్యాధి సంక్రమణలు వ్యాపించాయి. వాటిలో 40.8 శాతం పిల్లల నుండి పిల్లలకు, 29.6 శాతం పిల్లల నుండి పెద్దలకు, 20.3 శాతం పెద్దల నుండి పిల్లలకు, 9.3 శాతం పెద్దల నుంచి పెద్దలకు సంక్రమించాయి. ఇండెక్స్, సెకండరీ కేసుల మధ్య మధ్యస్త క్రమ విరామం(మీడియన్ సీరియల్ ఇంటర్‌వెల్) రెండు రోజులే. ఎనిమిదేళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలే వ్యాధి సంక్రమణకు చాలా వరకు కారకులు. మహమ్మారి కాలంలో పిల్లల నుండి వ్యాపించిన నిష్పత్తి కమ్యూనిటీ కోవిడ్19 కేసులతో ప్రతికూల సంబంధం కలిగి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News