Wednesday, November 6, 2024

కోలుకున్న సగం మందిలో 6 నెలల వరకు కోవిడ్ లక్షణాలు

- Advertisement -
- Advertisement -
Covid symptoms up to 6 months after recovery
అమెరికా పరిశోధకుల అధ్యయనం వెల్లడి

వాషింగ్టన్ : కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో సగానికి సగం కన్నా ఎక్కువ మందికి కొవిడ్ లక్షణాలు ఆరు నెలల వరకు కొనసాగుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. అమెరికా లోని పెన్‌స్టేట్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. జర్నల్ జామా నెట్‌వర్క్ ఓపెన్‌లో ఇది వెలువడింది. ఈమేరకు ప్రభుత్వాలు, హెల్త్‌కేర్ సంస్థలు, ప్రజారోగ్య నిపుణులు, కొవిడ్ నుంచి కోలుకున్న అత్యధిక సంఖ్యలోని వారిపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుందని పరిశోధకులు సూచించారు. ఇలాంటివారు అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, కీళ్ల నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, తదితర లక్షణాలతో అస్వస్థులుగా ఉంటున్నారని పరిశోధకులు వివరించారు.

2019 డిసెంబర్ నుంచి 2021 మార్చి వరకు కొవిడ్ బాధితులుగా గుర్తింపు పొందిన వ్యాక్సిన్ పొందని 2,50,351 మంది పెద్దలు, పిల్లల నుంచి సేకరించిన 57 నివేదికలను సమీక్షించి అధ్యయనం చేశారు. ఈ పెద్దల్లో 79 శాతం మంది ఆస్పత్రి పాలవ్వగా, వీరిలో చాలామంది అత్యధిక ఆదాయ దేశాల వారే. రోగుల తాలూకు మధ్యంతర వయస్సు 54. వీరిలో మెజారిటీ సంఖ్య ( 56 శాతం) పురుషులే. కొవిడ్ నుంచి వీరు కోలుకున్నాక నెల, రెండు నుంచి ఐదు నెలలు, ఆరు అంతకన్నా ఎక్కువ నెలల కాలాలుగా మూడు విరామాల్లో వారి ఆరోగ్యాన్ని సమీక్షించారు. వీరిలో ప్రతి ఇద్దరిలో ఒకరు సుదీర్ఘకాల కొవిడ్ లక్షణాలతో సతమతమౌతున్నట్టు పరిశోధకులు గ్రహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News