- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ బుధవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు తెలంగాణ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా పరిస్థితులపై చర్చలు జరిపేందుకు మంత్రి కెటిఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. తాత్కాలిక సచివాలయ భవనంలోని సిఎస్ కార్యాలయంలో కొవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశమైంది. కరోనా రోగులకు మందులు, వైద్య సదుపాయాలను వేగవంతం చేయడంతో పాటు వ్యాక్సిన్లు త్వరగా సరఫరా చేయడం కోసం మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సిఎంఒ నుండి సిఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా కొనసాగుతున్నారు.
- Advertisement -