Sunday, December 22, 2024

జ్వరం, ఒళ్లు నొప్పులుంటే కొవిడ్ టెస్ట్

- Advertisement -
- Advertisement -

Covid test for fever and sore throat

8లక్షణాలతో జాబితా విడుదల
రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు వేగవంతం చేయండి
ప్రభుత్వ ఆమోదిత స్వీయ పరీక్ష కిట్లను ప్రోత్సహించండి
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో మరోసారి కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జ్వరం, ఒంటి నొప్పి వంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా అందరూ కొవిడ్ టెస్టులు చేసుకోవాలని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధానంగా 8 లక్షణాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. దగ్గు ఉన్నా లేకపోయినా జ్వరం, ఒంటి నొప్పి, తల నొప్పి, గొంతు నొప్పి, ఇటీవల రుచి లేదా వాసన కోల్పోవడం, అలసట, అతిసారం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కరోనా సోకినట్లుగా నిర్ధారణ కాకపోయినా కరోనా అనుమానిత కేసుగా పరిగణించాలని పేర్కొంది. ఈ ఎనిమిది లక్షణాలున్న వ్యక్తులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శుక్రవారం లేఖ రాసింది.

దేశంలోని పరీక్షా కేంద్రాలలో ప్రతిరోజూ 20 లక్షలకుపైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థం ఉందని, లక్షణాలు ఉన్న అందరినీ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని తెలిపింది. గత అనుభవాల దృష్టా ఆర్‌టిపిసిఆర్ ఫలితాలకు 5 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నందున రాపిడ్ యాంటిజెన్(ఆర్‌ఎటి) పరీక్షలను వేగవంతం చేయాలని కోరింది. ప్రభుత్వం ఆమోదించిన స్వీయ పరీక్షా కిట్లను ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించింది. 24 గంటలు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు అందరూ సులభంగా పరీక్షలు చేయించుకునేలా ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రైవేట్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలు సులువుగా పరీక్షలు చేయించుకునేలా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News