Monday, December 23, 2024

వ్యాక్సిన్‌కు ఆసక్తి చూపని 12-14 చిన్నారులు…

- Advertisement -
- Advertisement -

Covid vaccination for 12-14 age group

నగరంలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీ
ఇప్పటివరకు 2 శాతం వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలు
పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్యుల సూచనలు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో గత ఐదు రోజుల నుంచి 12 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభిస్తే తీసుకునేందుకు పిల్లలు ముందుకు రావడంలేదని వైద్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఆరోగ్య నిపుణులు నాలుగో వేవ్ వచ్చే అవకాశముందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. టీకా తీసుకునే చిన్నారులంతా పాఠశాలకు చెందిన వారు కావడంతో స్కూళ్ల నిర్వహకులు అవగాహన కల్పించడం లేదని, పరీక్షల పైనే దృష్టి పెట్టారని వైద్యులు చెబుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా విధులు నిర్వహించడం సరికాదంటున్నారు. ఇకా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకునే పనిలో ఉండటం తప్ప పిల్లల యోగ క్షేమాలు పూర్తిగా మరిచిపోయారని ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ప్రతి విద్యార్థి వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సాహించి వీలైనంత త్వరగా టీకా ఇప్పించాలని కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ మూడు జిల్లాల పరిధిలో 3, 25,522 మంది చిన్నారులు వ్యాక్సిన్ పంపిణీ కోసం గుర్తించినట్లు తెలిపారు. గత 05 రోజుల నుంచి టీకా పంపిణీ చేస్తుండగా ఇప్పటివరకు హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో 2 శాతం, రంగారెడ్డిలో 6 మంది తీసుకున్నట్లు గణాంకాలు వెల్లస్తున్నాయి. వీరందరికి టీకాలు వేసేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు. టీకా తీసుకునే వారికి ఆధార్, పుట్టిన తేదీ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్ ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, నేరుగా వెళ్లిన టీకా వేస్తామని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. మొదటి, రెండో డోసుకు మధ్య 28 రోజుల వ్యవధి ఉండాలి.

హైదరాబాద్ జిల్లాలో 1,14,045 మందిని పిల్లలను ఇప్పటివరకు 2486 మంది తీసుకున్నట్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1,15,857 మందిని గుర్తించగా 2525, రంగారెడ్డి జిల్లాలో 95,620 మందిని గుర్తించగా 10346 మంది చిన్నారులు టీకా తీసుకున్నారు. ప్రారంభంలో పిల్లలు టీకాపై నిర్లక్షం చేస్తే వచ్చే నెల నుంచి పరీక్షల హడావుడిలో ఉంటారని, పరీక్షలకు ముందే స్కూళ్ల నిర్వహకులు వ్యాక్సిన్ తీసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయాలని వైద్యశాఖ అధికారులు కోరుతున్నారు. టీకా తీసుకోకుంటే నాల్గోవేవ్ వస్తే పిల్లలకు వైరస్ సోకితే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. జనవరిలో టీనేజర్లకు టీకా ప్రారంభిస్తే పెద్ద ఎత్తున ఆరోగ్య కేంద్రాలకు వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారని అదే తరహాలో 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరు టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News