- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు నిండిన అందరీకి కోవిడ్ టీకాలు వేయనున్నట్టు తెలిపింది. కోవిడ్ టీకాల విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. దేశంలో కరోనా టీకాల కొరత లేదని జావడేకర్ చెప్పారు. భారత్ లో టీకా ప్రక్రియ వేగంగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.85 కోట్ల మందికి కోవిడ్ టీకాలు వేశామన్న ప్రకాశ్ జావడేకర్… 80 లక్షల మందికి రెండో డోసు టీకా ఇచ్చామన్నారు. గడిచిన 24గంటల్లో 32లక్షల మందికి కోవిడ్ టీకాలు వేసినట్టు ఆయన వెల్లడించారు. ఫిబ్రవరిలో సగటున రోజుకు 3.77 లక్షల మందికి టీకాలు ఇచ్చామన్నారు.
Covid vaccine for everybody above 45 years of age
- Advertisement -