లండన్ : ‘అత్యంత అరుదైన కేసుల్లో’ తమ కొవిడ్ వ్యాక్సిన్ రక్తం గడ్డ క ట్టడం వంటి సైడ్ ఎ ఫెక్ట్‌లు కలి గించగలవని యుకె ప్రధాన కేం ద్రంగా గల ఫార్మాస్యూటికల్ ది గ్గజం ఆస్ట్రాజెనెకా (ఎజెడ్) అం గీకరించింది. అయితే, ఇలా ఎం దుకు జరుగుతున్నదో తెలియ దని సంస్థ పేర్కొన్నది. యుకె మీడియా ఉ టంకిస్తున్న కోర్టు పత్రాల ద్వారా ఈ విషయం తెలియవచ్చింది. 51 మంది వ్యక్తులు గ్రూప్ కార్యాచరణ నిమి త్తం ఫిబ్రవరిలో లండన్‌లో హైకోర్టులో సమ ర్పించిన లీగల్ డాక్యుమెంట్ లో కొవిడ్ 19 నుంచి రక్షణకై ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయంతో కలసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ‘అత్యంత అరు దైన కేసుల్లో’ ‘థ్రాంబోసిస్ విత్ థ్రాంబో సైటోపెనియా సిండ్రోమ్’ (టిటిఎస్ )ను కలిగిం చగలదని ఎజెడ్ అంగీకరించిందని ‘ది డైలీ టెలిగ్రాఫ్’ వెల్లడించింది. ఎజడ్ వ్యాక్స్‌జెవ్రియా వ్యాక్సిన్‌ను భారత్ లో ‘కొవిషీల్డ్’ పేరిట సీరమ్ ఇన్ స్టిట్యూట్ (ఎస్‌ఐఐ) తయారు చేస్తున్నది.టీ కాతీసుకున్న వా రిలో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్ లెట్లు పడిపోవడం వంటి దు ష్ప్రభావాలు తలె త్తాయని ఎజెడ్ అంగీకరించింది. ‘ఎజెడ్ వ్యా క్సిన్ అత్యంత అరుదైన కేసుల్లో టిటిఎస్ కలి గించగలదు. అయితే ఆ విధంగా ఎలా జరు గు తోందో తెలియదు.
అంతే కాదు. ఎజెడ్ వ్యా క్సి న్ (లేక ఏ వ్యాక్సిన్ అయినా) తీసుకోక పో యినా టిటిఎస్ సంభవించవచ్చు. ఏ వ్యక్తిగత కేసులోనైనా అలా ఎందుకు జరుగుతోందో నిపుణులు పరిశీలించవలసి ఉంది’ అని కోర్టు పత్రాలను ఉటం కిస్తూ దినపత్రిక సూచించిం ది. అయితే, టీకా సామర్థంపై వస్తున్న వార్త లను మాత్రం ఎజెడ్ ఖండించింది. ఈ టీకా ఒకరి మృతికి కారణం కావడంతో పాటు మరి 51 మంది తీవ్రంగా ఇబ్బంది పడినట్లు కేసు న మోదైంది. జరిగిన నష్టానికి 100 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 1000 కోట్లు) పరి హా రం కోరుతూ యుకె హైకోర్టులో దావా నమోదైంది. టిటిఎస్ దుష్ప్రభావాలు ఏమిటంటే పక్షవాతం, మెదడు దెబ్బ తినడం, గుండె పోట్లు, పల్మనరీ ఎంబాలిజం సహా ప్రాణానికి హాని కలిగించేవిగా ఉంటున్నాయి. వ్యాక్సిన్ ఫలితంగా క్షతగాత్రులైనవారి విషయంలో ఆస్ట్రాజెనెకా యుకె లిమిటెడ్‌పై 1987 యుకె వినియోగదారుల రక్షణ చట్టం సెక్షన్ 2 కింద పరిహారం కోసం లై డే న్యాయవాద సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్న
గ్రూప్ కార్యాచరణలోని 51 మంది క్లైమెంట్లలో 12 మంది మరణించిన ఒక ప్రియతమ వ్యక్తి తరఫున వ్యవహరిస్తున్నారు. ‘ఈ గ్రూప్‌లోని వారందరి వద్ద వ్యాక్సిన్ వల్ల మరణాలు, గాయాలు సంభవించాయని నిర్ధారిస్తున్న డెత్ సర్టిఫికేట్లు లేదా వైద్య సాక్షాధారాలు ఉన్నాయి’ అని లై డే సంస్థ భాగస్వామి సారాహ్ మూర్ తెలిపారు.‘2021 చివరి నుంచి వైద్య సమాజం ఈ వాస్తవాన్ని విస్తృతంగా అంగీకరించగా తమ వ్యాక్సిన్ ఈ హాని కలిగించిందనిలాంఛంగా ఒప్పుకోవడానికి ఆస్ట్రాజెనెకా ఒక ఏడాది తీసుకున్నది’ అని ఆమె పేర్కొన్నారు.