- Advertisement -
తిరువనంతపురం : కేరళలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. మరిన్ని డోసుల వ్యాక్సిన్‌ను వెంటనే రాష్ట్రానికి పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి అభ్యర్థించారు. కేరళలో ఇప్పటికీ కరోనా కేసులు విజృంభిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు 41 లక్షల సంఖ్య దాటింది. ఈ పరిస్థితులలో తమకు అదనంగా వెంటనే వ్యాక్సిన్లు పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపించింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కోవిషీల్ట్ టీకాల నిల్వలు పూర్తిగా అయిపొయ్యాయి. కోవిడ్ పూర్తి స్థాయి నియంత్రణకు వెంటనే టీకాల అవసరం ఉందని ఆరోగ్య మంత్రి తెలిపారు.
- Advertisement -