నిజాలు తేల్చిన పరిశోధకులు
వాషింగ్టన్ : కరెన్సీ నోట్లపై కొవిడ్ వైరస్ కణాలు ఎక్కువ కాలం మనజాలవని ఇప్పటి పరిశోధనలలో వెల్లడైంది. నోట్లపై ఈ సార్స్ కోవ్ 2 వైరస్ సంక్రమించిన వెంటనే అంతరించి పోతుందని అమెరికాలోని బ్రిగ్హమ్ వర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేల్చారు. కొవిడ్ ఉధృతి దశలో కరెన్సీ నోట్లతో వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని ప్రచారం జరిగింది. దీనితో అత్యధికులు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఇతర ప్లాస్టిక్ కార్డులతో డబ్బుల లావాదేవీలు సాగించారు. అయితే నోట్లపై ఈ వైరస్ కణాలు వెంటనే హరించుకుపోతాయని, నోట్ల బదులు కార్డులు వాడాలనే సూచనలు పనికిరావని సైన్స్ పత్రికలో వెల్లడైన అధ్యయన పత్రంలో తెలిపారు. నోట్లపై క్షణాలల్లోనే వైరస్ లేకుండా పోతుంది. అయితే ప్లాస్టిక్ కార్డులపై ఈ వైరస్ సోకితే 48 గంటల పాటు వీడకుండా ఉంటాయని, ఈ క్రమంలో వాటిని వాడిన వారు వైరస్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కరోనా మహమ్మారి ఉధృతి తొలి దశలో నోట్ల వాడకం వాటి లావాదేవీలపై తలెత్తిన ప్రచారం కేవలం అపోహ అని, పైగా వాటితో పోలిస్తే ప్లాస్టిక్ కార్డులతోనే వైరస్ వ్యాప్తి అవకాశాలు ఉన్నాయని తేటతెల్లం చేశారు.