వాషింగ్టన్: కరోనా వైరస్ మానవ నిర్మితమని చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో పని చేసిన అమెరికా సైంటిస్ట్, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తెలిపారు. చైనా ప్రభుత్వం నిర్వహించే వుహాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవి) నుంచే రెండేళ్ల కిందట కరోనా వైరస్ లీక్ అయ్యిందని తన తాజా పుస్తకం ‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’లో పేర్కొన్నారు. చైనా ల్యాబ్‌లో అధ్యయనం చేస్తున్న కరోనా వైరస్‌లకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చడం వల్ల ఈ మహమ్మారి సంభవించిందని తెలిపారు. ‘ఇది జన్యుపరంగా రూపొందించిన ఏజెంట్ అని చైనాకు మొదటి రోజు నుండి తెలుసు. మనం వారికి (చైనా)కు బయోవెపన్ టెక్నాలజీని అందజేస్తున్నాం’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివరాలను ‘న్యూయార్క్ యార్క్ పోస్ట్’ తెలిపింది.
సరైన భద్రత లేని ప్రయోగాల ఫలితంగా వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయ్యిందని సైంటిస్ట్, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తెలిపారు. ‘సరైన జీవ భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను నియంత్రించే చర్యలు ఆ విదేశీ ప్రయోగశాలలో లేవు. ఈ నేపథ్యంలో వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్‌కు దారితీసింది’ అని తన పుస్తకంలో పేర్కొన్నారు.