Sunday, January 19, 2025

దేశంలో మొదటి ఎక్స్ఈ వేరియంట్ కేసు..

- Advertisement -
- Advertisement -

Covid XE variant confirmed in india

ఇన్సాకాగ్ ధ్రువీకరణ

న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ ఈ మొదటి కేసును గుర్తించినట్టు తాజాగా ఇన్సాకాగ్ ధ్రువీకరించింది. అత్యంత సాంక్రమిక శక్తి ఉందని భావిస్తోన్న ఈ వేరియంట్ ఇదివరకే గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగు చూసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై కచ్చితమైన నిర్ధారణ లేదు. తాజాగా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ప్రభుత్వ కన్సార్షియం (ఇన్సాకాగ్) దీనిపై స్పష్టత ఇచ్చింది. బిఎ.2.10, బిఎ 2.12, బిఎ 2 ఉపరకాలుగా గుర్తించాం. బిఎ.2 పాత సీక్వెన్సులే కొత్త వాటిగా వర్గీకరణకు గురయ్యాయి. ఇవి వైరస్ తీవ్రత పెంచుతాయనేదానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. గత వారంతో పోల్చితే 12 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 19 రాష్ట్రాల్లో తగ్గుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో ఎక్స్‌ఈ క్లస్టర్లు ఏర్పడిన దాఖలాలు లేకపోవడం ఊరటనిచ్చే అంశం అంటూ ఇన్సాకాగ్ తాజాగా వెల్లడించింది. ఒమిక్రాన్ ఉపరకాలైన బిఎ 1, బిఎ 2 ల కలయికగా భావిస్తోన్న ఎక్స్ ఈ వేరియంట్ తొలుత బ్రిటన్‌లో వెలుగు చూసింది. అనంతరం పలు దేశాలకూ పాకింది.

కొద్ది వారాల క్రితం ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రల్లో నమోదైనట్టు స్థానిక ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే ఈ ఎక్స్ ఈ వేరియంట్ వ్యాప్తి , తీవ్రతపై స్పష్టత లేనప్పటికీ, ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్ అధిక సాంక్రమిక శక్తి కలిగి ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే వ్యాపించే గుణం ఎక్స్ ఈ వేరియంట్‌కు దాదాపు 10 శాతం ఎక్కువ ఉన్నట్టు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల ఉనికి కనిపిస్తున్నప్పటికీ కరోనా కొత్త కేసుల సంఖ్య మాత్రం అదుపులో ఉంది. వ్యాక్సినేషన్, కరోనా కొత్త కేసుల సంఖ్య మాత్రం అదుపు లోనే ఉంది. వ్యాక్సినేషన్ , కరోనా కారణంగా సహజంగా సంక్రమించిన రోగ నిరోధకత, వైరస్ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News