- Advertisement -
న్యూఢిల్లీ : ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకా కొవిషీల్ట్కు ఐరోపా సమాఖ్య లోని 16 దేశాలు గుర్తించడం గొప్ప శుభవార్తగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అదర్ పూనావాలా పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కొవిషీల్డ్ తీసుకున్న పర్యాటకుల రాకకు 16 ఐరోపా దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో ఆ దేశాలకు పర్యాటకులు వెళ్లడానికి వీలు ఏర్పడింది. అయితే దేశాల మధ్య నిబంధనలు మారుతుంటాయి కాబట్టి టీకా తీసుకున్నప్పటికీ ప్రయాణానికి ముందే ఆ దేశ స్థానిక నిబంధనలు స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉందని ట్వీట్ చేశారు.
Covishield 16 countries recognized in Europe
- Advertisement -