Sunday, December 22, 2024

కోవిషీల్డ్ ఔషధాలనైతే వెనక్కి తీసుకున్నారు…వ్యాక్సిన్ తీసుకున్న వారి సంగతేమిటి?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆస్ట్రా జెనెకా ఇటీవల కోవిషీల్ఢ్ ఔషధాన్ని ఉపసంహరించుకుంది. కానీ ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను వేయించుకున్నవారి సంగతేమిటి? కోవిషీల్ఢ్ ను భారత్ లో అమ్మారు. దాని వల్ల రక్తం గడ్డ కట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయని యూకె మీడియా రిపోర్టు చేసింది.

గతంలో కోవిషీల్ఢ్ తీసుకున్నవారు థ్రోంబోసిస్ తో కూడిన థోంబోసైటోపెనియా సిండ్రమ్(టిటిఎస్) వంటి సైడ్ ఎఫెక్ట్ గురించి కంగారు పడుతున్నారు. దీనిపై ఆరోగ్య అధికారులను అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే- ‘‘కోవిషీల్ఢ్ ను ఉపసంహరించుకోవాలని ఆస్ట్రా జెనెకా కంపెనీ భావించిందంటే దానికి తగిన కారణాలే ఉంటాయి. వ్యాక్సిన్ భద్రత, సమర్ధత పై అనుమానాల కారణంగానే దానిని ఉపసంహరించుకుని ఉంటారు. ప్రజలు ఆందోళన చెందడంలో అర్థముంది. అయితే ఆరోగ్య అధికారులు, నిపుణుల మార్గదర్శకాలను నమ్మాల్సి ఉంటుంది. వారు డేటాను సంపూర్ణంగా పరిశీలిస్తారు’’ అని హైదరాబాద్ కేర్ హాస్పిటల్ కు చెందిన  డాక్టర్ రాహుల్ అగర్వాల్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News