Friday, November 22, 2024

కొవిషీల్డ్ రెండో డోసుపై కేంద్రం స్పష్టత

- Advertisement -
- Advertisement -

Covishield second dose appointment booked already won't be cancelled

ఇదివరకే అపాయింట్ మెంట్ తీసుకున్నవారికి గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ : కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని కేంద్రం ఇటీవల పొడిగించడంతో రెండో డోసు కోసం ఆస్పత్రులకు వెళ్లే వారిని వెనక్కు పంపుతున్న సంఘటనలు ఎదురౌతున్నాయి. ఈ ఉదంతాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆదివారం కీలక నిర్ణయం ప్రకటించింది. రెండో డోసుకు సంబంధించి ఇదివరకే అపాయింట్‌మెంట్ తీసుకుంటే దాని ప్రకారం డోసు వేయాలని, ఆ అపాయింట్‌మెంట్ చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొవిడ్ పోర్టల్‌లో అపాయింట్‌మెంట్ రద్దు చేయలేదని వివరించింది.

కొత్తగా రెండోడోసు కోసం అపాయింట్‌మెంట్ తీసుకునేవారికి మాత్రమే గడువు పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కొవిడ్ వర్కింగ్ గ్రూప్ సూచనల ప్రకారం కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 12 నుంచి 16 వారాలకు కేంద్రం మే 13న పొడిగించింది. ఈ నేపథ్యంలో రెండో డోసుకు వెళ్తున్న వారిని అక్కడ సిబ్బంది తిప్పి పంపుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. దాంతో ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకుంది. ఇదివరకే తీసుకున్న అపాయింట్‌మెంట్లు చెల్లుతాయని, వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిని ఎవర్నీ వెనక్కు తిప్పి పంపవద్దని కేంద్రం తాజాగా ఆదేశించింది. ఈమేరకు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంఆలకు సూచించింది. అలాగే వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు కూడా మొదటి డోసును వేసుకున్న 84 రోజుల తరువాత వ్యాక్సిన్ వేసుకునేలా రీషెడ్యూల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News