Monday, December 23, 2024

విద్యుత్ ఘాతానికి గురై ఆవు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ కోడేరు: విద్యుత్ షాక్‌కు గురై ఆవు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని ఊరుగుట్ట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఊరు గుట్ట గ్రామానికి చెందిన కురుమయ్య రోజు వారి మాదిరగా పశువులను మేపేందుకు వెళ్లగా గత రెండు రోజుల క్రితం ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభం విరిగి పడింది. పశువుల యజమాని కురుమయ్య పశువులను మేపుతూ ఉండగా పడి ఉన్న విద్యుత్ తీగ తగలడంతో ఆవు అక్కడికక్కడే చనిపోయింది. 60వేల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని రైతులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులు క్రితం కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభం నేలకు ఒరిగిందని, అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News