Tuesday, December 3, 2024

మొసలి దాడిలో ఆవు మృతి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: మొసలి దాడిలో పాడి ఆవు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. మాణిక్యం భూమేశ్ అనే వ్యక్తి చెరువులో బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తున్నాడు. చెరువు ఒడ్డున ఆవును, లేగ దూడను వదిలి పెట్టి చెరువులో భూమేశ్ బట్టలు ఉతుకుతున్నాడు. ఆవు చెరువులోకి వెళ్లగాను మొసలి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన ఆవు గర్భంతో ఉందని భూమేశ్ పేర్కొన్నాడు. గతంలో చెరువులో మొసలి ఉందని చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదని అతడు వాపోయాడు. తనకు రూ.90 వేల నష్టం వాటిల్లిందని తెలిపాడు. చెరువులో బట్టలు ఉతకాలంటే భయంగా ఉందని రజకులు వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ. జల శాఖ అధికారులు చెరువులో ఉన్న మొసలిని పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News