Wednesday, January 22, 2025

కరెంట్‌షాక్‌తో ఆవు మృత్యువాత

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : మండలంలోని తమ్మడపల్లి (ఐ) కి చెందిన రైతు బుల్లె కుమారస్వామి కి చెందిన ఆవు శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం… కుమారస్వామి వ్యవసాయ భూములు ఇదే మండలంలోని దుర్గ తండ శివారులో ఉన్నాయి. ఇక్కడ ఉదయం తనకున్న రెండు ఎడ్లు, ఒక ఆవును నీటి కోసం వదిలాడు. ఈ క్రమంలో అక్కడే కేవలం రెండు ఓడలపై బిగించి ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌కు నీటి కోసం వెళుతున్న ఆవు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదం పూర్తిగా విద్యుత్ అధికారుల నిర్లక్షంతోనే జరిగిందని బాధిత రైతు తెలిపాడు. ట్రాన్స్ ఫార్మర్ కిందికి ఉన్న విషయంపై పలుమార్లు విన్నవించుకున్నా పెడచెవిన పెట్టారని అన్నారు. గతంలో కూడా ఒక పశువు ఇదే ట్రాన్స్‌ఫార్మర్‌కు బలైందన్నారు. ఆవు విలువ సుమారుగా రూ.70 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశాడు. కాగా విద్యుత్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News