Tuesday, December 24, 2024

గో ఆలింగన పిలుపుపై కేంద్ర మంత్రుల ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

 

 

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14వ తేదీన గో ఆలింగన దినోత్సవం జరుపుకోవాలంటూ జంతు సంక్షేమ బోర్డు ఇచ్చిన పిలుపును కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం సమర్థించారు. ప్రతి ఒకరూ గోవులను ప్రేమించాలని ఆయన కోరారు. గోవులను ఆలింగనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలను ఆయన అభినందించారు. మనమందరం ఆవును ప్రేమించి వాటిని ఆలింగనం చేసుకోవాలని గిరిరాజ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
మరో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన జ్యోతి కూడా గోవును ఆలింగనం చేసుకోవాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. గోవులో 33 కోట్ల దేవుళ్లు, దేవతలు కొలువై ఉంటారని ఆమె అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News