Saturday, November 16, 2024

వాలెంటైన్స్ డే కాదు.. గోవును హత్తుకునే రోజు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: దేశమంతా ఫిబ్రవరి 14వ తేదీని వాలెంటైన్స్ డే(ప్రేమికుల రోజు)గా జరుపుకుంటుంది. అయితే ఆ రోజును గో ఆలింగన దినోత్సవంగా జరుపుకోవాలంటూ భారత పశు సంక్షేమ బోర్డు ప్రజలకు పిలుపు ఇచ్చింది. కేంద్ర మత్స, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు పశశు సంక్షేమ బోర్డు కార్యదర్శి బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన జారీచేశారు. పాశ్చాత్య ప్రభావం కారణంగా భారతీయ సంస్కృతి దెబ్బతింటోందని పేర్కొన్నారు.

జంతువుల పట్ల ప్రేమాభిమానాలను చాటుకునేందుకు ఫిబ్రవరి 14వ తేదీన భారతీయులంతా గోవులను ఆలింగనం చేసుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవు వన్నెముక అన్న విషయం మనందరికీ తెలుసునని, గోవును కామధేనుగా, గోమాతగా కూడా పిలుస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News