Saturday, November 2, 2024

ఆవు మాకు పవిత్రం… వాళ్లకు పాపం

- Advertisement -
- Advertisement -

Cow is mother, sacred to us says PM Modi

వారణాసి సభల్లో మోడీ వ్యాఖ్యలు

వారణాసి : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్‌లో విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. యూపిలో ఆవుల పోషణకు తాము గర్వపడుతుండగా, కొందరు దాన్నో పాపంగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. కోట్లాది మంది ప్రజలు పశుసంపదపై ఆధారపడి జీవిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయి ఆవులు, గేదెలపై జోక్‌లు వేస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. గురువారం ప్రధాని మోడీ వారణాసి లోని డెయిరీ, విద్య, ఆరోగ్యం వంటి 22 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గురువారం ఉదయం తన నియోజకవర్గమైన వారణాసికి విచ్చేసిన మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మాట్లాడుతూ డెయిరీ రంగంపై యోగి ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు. గత ఆరేడు సంవత్సరాలతో పోలిస్తే భారత దేశంలో పాల ఉత్పత్తి 45 శాతం పెరిగిందన్నారు.

ఈరోజు ప్రపంచ పాల ఉత్పత్తిలో 22 శాతం భారత్‌దేనని, దేశంలో ఉత్తరప్రదేశ్ అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం గానే కాకుండా డెయిరీ రంగాన్ని విస్తరిస్తున్న రాష్ట్రంగా నిలుస్తున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. దేశంలో కోట్లాది మంది ఆధారపడి జీవిస్తున్న గోవు తమకు అమ్మలాంటిదని, ఎంతో పవిత్రంగా భావిస్తామన్నారు. సమాజ్‌వాది పార్టీని మాఫియావాద్, పరివార్‌వాద్ అని మండిపడిన ప్రధాని , సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌కే తమ ప్రాధాన్యమని చెప్పారు. యూపి, కాశీలలో డబుల్ ఇంజిన్ అభివృద్ధి గురించి తాను మాట్లాడుతుంటే కొందరు బాధపడుతున్నారని, వాళ్లంతా యూపీ రాజకీయాలను కేవలం కులం, మతం, మత బేదాలతో చూసినవారేనని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News