Friday, December 20, 2024

చిరుతపులి దాడిలో ఆవు మృతి

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ : గుడిహత్నూర్ మండలంలోని చిన్నమన్నూర్ శివారు అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఆవుపై చిరుతపులి దాడి చేసి హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని చిన్నమన్నూర్ గ్రామానికి చెందిన బాధిత రైతు పెందూ మారుతి తెలిపిన కథనం ప్రకారం ప్రతిరోజులాగే తన ఆవులను సమీపంలోని అటవీ ప్రాంతంలో గల తమ వ్యవసాయ భూమిలోని పశువుల పాకలో కట్టేసి అక్కడే మంచెపై పడుకున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఆవులు అరుపులు వినిపించడంతో లేచి చూడగా చిరుతపులి ఆవుల మందపై దాడి చేసి ఒక ఆవును హతమార్చినట్లు తెలిపారు.

జరిగిన సంఘటన విషయాన్ని గ్రామస్తులతో పాటు అటవీ అధికారులకు సమాచారాన్ని అందించామని తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాను విలువైన ఆవును కోల్పోయానని ప్రభుత్వం పరంగా తనను ఆదుకోవాలని ఆయన మొరపెట్టుకున్నాడు. ఈ విషయమై ఫారెస్ట్ సెక్షన్ అధికారి భూమన్నను వివరణ కోరగా చిరుతపులి ఆవును చంపినట్లు నిర్దారణకు వచ్చిందని బాధితుని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News